అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద వైభవంగా ‘వనమహోత్సవం’
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జులై 20 (ప్రజావాణి): దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆదివారం రోజునా మండలం లోని ఉండేడ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో 'వనమహోత్సవం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీడీఎన్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షులు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ సర్పంచ్ ఆవుల మమత తిరుపతి, ఉపసర్పంచ్ పోతు రవి, దేవాలయ చైర్మన్ రాయమల్లు,...