అన్నోజిగూడ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించిన సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి
పోచారం, జూన్ 30: అన్నోజిగూడలోని జడ్పీహెచ్‌ఎస్ (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల)ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యా పరిస్థితులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ 6వ, 7వ, 8వ, 9వ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోవడం లేదని, ఒకే గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల బోధన నిర్వహించడం కష్టంగా మారుతోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో...