ఘట్‌కేసర్, ఏప్రిల్ 16 (ప్రజావాణి):మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం వార్డు అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ కాలనీలో ఉద్యమకారుడు డా. మొక్క ఉపేందర్ కుమార్తె రిషిక ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మహాజన చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు, అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకుడు, కవి, రచయిత, పరిశోధకుడు, సమాజ సేవకుడు, జర్నలిస్టు డా. మొక్క ఉపేందర్ కుమార్తె రిషిక జన్మదిన వేడుకలు స్థానిక కాలనీలో ఆనందోత్సాహాలతో జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి భాగం శ్రీనివాసరావు చౌదరి, ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫోరం జనరల్ సెక్రటరీ నర్సింగ్ రావు హాజరై కేక్ కట్ చేయించి పాపకు బహుమతులు అందజేసి ఆశీర్వదించారు.
పాప తల్లిదండ్రులు మొక్క ఉపేందర్, దివ్య రిషికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు మొక్క ఏడుకొండలు, బెల్లంకొండ ధనలక్ష్మి కూడా హాజరై పాపకు ఆశీర్వాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా రిషిక అన్నయ్య మొక్క మహేంద్ర కౌండిన్య స్నేహితులు కలిసి టెడ్డి బేర్‌ను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో వనిత, అనిత, మండవ పద్మ, గోపి, కోల్పుల సంతోషి, మైసమ్మ, సంధ్యా, సాత్విక్, కీర్తిక్ తదితరులు పాల్గొని పాపకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కాలనీ వాసులు, నాయకులు, పెద్దలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
