అన్నోజిగూడలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్

పోచారం, జూలై 14 (ప్రజావాణి): పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నోజిగూడ అయ్యప్ప దేవాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు సవరణ) అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను...