అన్నోజిగూడలో ఆషాడ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు…. ఈ నెల 16న వైభవంగా నిర్వహణకు గ్రామ పెద్దల ఏకగ్రీవ తీర్మానం..

ఘట్‌కేసర్, ఆగస్టు 2 (ప్రజా వాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ గ్రామంలో ఈ నెల 16వ తేదీన ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం గ్రామంలోని శ్రీ ఎర్ర పోచమ్మ, శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ మహంకాళి దేవాలయాల ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, నూతన, మాజీ కమిటీ సభ్యులు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల నిర్వహణ, అమ్మవార్ల ఊరేగింపు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు,...