ప్రజావాణిన్యూస్(మార్చి15) అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటన పట్టణంలోని త్యాగరాజు వీధిలో జరిగింది.స్థానిక సమాచారం ప్రకారం,త్యాగరాజు వీధిలో నివసించే ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించేందుకు మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు.వాహనం బాగుపడేందుకు రాత్రంతా స్టార్టింగ్‌లో ఉంచాలని మెకానిక్ సూచించడంతో,ఆ వ్యక్తి బైక్‌ను స్టార్ట్‌లోనే ఉంచి ఇంటి తలుపులు మూసుకున్నట్లు తెలుస్తోంది.రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఇంట్లోకి చేరడంతో ఊపిరాడక ఇంట్లో ఉన్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.