అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ–బీఎఫ్‌ఎస్‌ఐ ప్రత్యేక కోర్సు ప్రారంభం

ఘట్‌కేసర్, జూన్ 11: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో అనురాగ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ప్రముఖ సలహా సంస్థ కేపీఎంజీతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎంబీఏ–బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) ప్రత్యేక కోర్సును ప్రారంభించింది. ఈ మేరకు గురువారం ఘట్‌కేసర్‌లోని వెంకటాపూర్ ప్రాంగణంలో ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ విష్ణు వందన మాట్లాడుతూ, పరిశ్రమలతో విశ్వవిద్యాలయానికి ఉన్న బలమైన అనుబంధానికి ఈ ఒప్పందం నిదర్శనమని...