అనురాగ్ యూనివర్సిటీలో మాదకద్రవ్యాల వ్యతిరేక, ర్యాగింగ్ నిరోధక – రోడ్డు భద్రత అవగాహన సదస్సు
ఘాట్ కేసర్, ఆగస్టు 6: విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, సురక్షిత జీవన విధానంపై అవగాహన పెంపొందించేందుకు అనురాగ్ యూనివర్సిటీలో మాదకద్రవ్యాల వ్యతిరేక, ర్యాగింగ్ నిరోధక మరియు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులు, ఎన్‌సీసీ క్యాడెట్లు సహా 5 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి రోడ్డు భద్రత విభాగం డీసీపీ శ్రీమతి ఐనపర్తి లక్ష్మి, ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి. సీతారాం, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్...