అనురాగ్ యూనివర్సిటీలో ఎస్టీఐలు , హెచ్‌ఐవీపై క్లినికల్ అవగాహనపై సిఎంఈ కార్యక్రమం విజయవంతం

ఘాట్ కేసర్, జూన్ 14: ఎస్టీఐలు (లైంగిక సంక్రమణ వ్యాధులు) మరియు హెచ్‌ఐవీపై వైద్యులకు తాజా క్లినికల్ అవగాహన, నిర్ధారణ పద్ధతులు, అభివృద్ధి చెందుతున్న చికిత్సా విధానాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన నిరంతర వైద్య విద్యా కార్యక్రమం (సీఎంఈ) విజయవంతంగా ముగిసింది. అనురాగ్ యూనివర్సిటీ, పోచారం, హైదరాబాద్‌లోని నీళిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చర్మవ్యాధులు, సుఖవ్యాధులు మరియు కుష్ఠు వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో డీకోడింగ్ ఎస్టీఐలు అండ్ హెచ్‌ఐవీ క్లినికల్ ఇన్‌సైట్స్, డయాగ్నస్టిక్ పెర్ల్స్ అండ్ ఎవాల్వింగ్ థెరపీస్ అంశంపై ఆదివారం...