అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సమయంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్ నంబర్ టీఎస్ 02 టి 1190ను ఆపి తనిఖీ చేయగా, యజమాని-డ్రైవర్ జల్లా మహేందర్ (గంగిరెడ్డిపల్లి గ్రామం)గా గుర్తించారు.అలాగే టీఎస్ 02 యు డి 9326 ట్రాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు....