అనుమతి లేకుండా నడుస్తున్న కాకరవాయి శ్రీరామ విద్యాలయం మూసివేత.
తిరుమలాయపాలెం, ప్రజావాణి: మలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో అనుమతి లేకుండా నడుస్తున్న శ్రీరామ విద్యాలయంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) శ్రీ ఎం. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలను మూసివేయించడం జరిగింది.వివరాల ప్రకారం, సంబంధిత పాఠశాల అనుమతులు లేకుండా నడుస్తున్నట్టు అధికారులకు సమాచారం అందడంతో వెంటనే పరిశీలన చేపట్టారు. పరిశీలనలో పాఠశాల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలపై చర్యలు తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా...