prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 8:01 pm Digital Edition : PRAJA VANI

అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

*–కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.*

*–గాయపడిన వారిని వేములవాడ ప్రభుత్వ అసుపత్రికి తరలింపు.*

*–క్షతగాత్రులను పరమర్శించిన ఎమ్మెల్యే అది శ్రీనివాస్.*

*–పూర్తి వివరాలు తెలియాల్సింది.*

*//వేములవాడ// జులై – 9 (ప్రజావాణి) ఆర్. సి. ఇంచార్జ్. తాటిపల్లి నరసింహస్వామి.*
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిసిల్ల నుండి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందినట్లు సమాచారం. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా తెలిసింది.ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని వెంటనే వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

*పరామర్శించిన ఎమ్మెల్యే అదిశ్రీనివాస్*

అనుపురం వద్ద జరిగిన ప్రమాదం సమాచారం అందుకున్న వేములవాడ ఎమ్మెల్యే అదిశ్రీనివాస్ హుటాహుటిన అసువత్రికి చేరుకొని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఘటనకు సంబదించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.