అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రునికి పూర్వ విద్యార్థుల అండ
తోటి మిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 11 (ప్రజావాణి): పాఠశాల రోజుల్లో పంచుకున్న జ్ఞాపకాలు కేవలం మధుర అనుభూతులు మాత్రమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే ధైర్యమని పాతగూడూర్ పూర్వ విద్యార్థులు నిరూపించారు. 2004-05 వ విద్యా సంవత్సరంలో పాతగూడూర్ గ్రామంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు తమ తోటి మిత్రుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం...