prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:46 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అనంతపురంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు నాయకులు కల్లూరి చెంగయ్య 50వ పుట్టినరోజు వేడుకలు

అనంతపురం(ఆగస్టు 01 ప్రజావాణి)ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ కల్లూరు జంగయ్య పిలుపు మేరకు,సంస్థ రాష్ట్ర శాశ్వత ఉపాధ్యక్షులు,ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు మరియు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము ఆధ్వర్యంలో డాక్టర్ కల్లూరి చెంగయ్య 50వ పుట్టినరోజు వేడుకలు శనివారం అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా నడిబొడ్డున ఉన్న రాజ్యాంగ పితామహుడు,భారత రత్నడాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కల్లూరి చెంగయ్య పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి,ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి,సంస్థ నాయకులు నాగప్ప, ఉరుముల కళాకారుల సీనియర్ నాయకులు మేడాపురం నరసింహులు,అనంతపురం నగర ఉపాధ్యక్షులు బి.సురేంద్ర,జిల్లా కమిటీ సభ్యుడు సంగా ఓబులేసు,అరవకూరు పెద్దన్న,రాష్ట్ర శాశ్వత ఉపాధ్యక్షులు ఎస్.కే.యూ.ఓబులేసు మరియు జిల్లా కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.