అధికార దాహం.. గోమాత శోకం.. ప్రొద్దుటూరు రాజకీయాల అసలు రంగు.! ఎస్.ఎస్. మాల్.. చుట్టూ రాజకీయం.. ఆకలి కేకలతో నడిగడ్డపై గోమాత నరకం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) ప్రొద్దుటూరు గడ్డ నేడు రాజకీయ నేతల స్వార్థ ప్రయోజనాలకు వేదికగా మారి కునారిల్లిపోతోంది.అభివృద్ధి అంటే కేవలం విమర్శలు,ప్రతివిమర్శలు అనుకుంటున్న నాయకుల మధ్య అసలైన.ధర్మం.అగాధంలోకి వెళ్ళిపోతోంది.గత వారం రోజులుగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్న ఎస్.ఎస్.మాల్ చుట్టూ జరుగుతున్న వివాదం,పరస్పర దూషణలు చూస్తుంటే ప్రొద్దుటూరు రాజకీయ ముఖచిత్రం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది.​రెండున్నర కోట్ల రాజకీయం.లక్షల ప్రాణాల విలువ ఎంత ప్రొద్దుటూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్.ఎస్.మాల్ ముచ్చటే.అధికార పక్షం,ప్రతిపక్షం.అటు వైఎస్సార్సీపీ,ఇటు టీడీపీ నేతలు.ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి జుట్టు ఒకరు...