prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 3:50 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అధికారుల వెంట ఎన్టీఆర్ సుధాకర్ రెడ్డి ఎందుకు వెళుతున్నాడు.భూ ఆక్రమణ విచారణలో అధికారులు…ఆ నాయకుడు కుమ్మక్కవుతున్నారా

వైయస్సార్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (మే14) కాశినాయన మండలంలో జరుగుతున్న భూ అక్రమాలపై క్షేత్రస్థాయి విచారణ  రెవెన్యూ విచారణలో ‘రాజకీయ’ నీడలు.ఆర్డీఓ పర్యటన కు ప్రత్యక్షమవుతున్న టీడీపీ చోట నాయకుడు.ఎన్టీఆర్ సుధాకర్ రెడ్డి.అధికారిక బృందంలో ఆయన హోదా ఏంటి.అధికారులకు.ఆ నాయకునికి సంబంధాలేంటి.అధికారుల వెంట ఎన్టీఆర్ సుధాకర్ రెడ్డి ఎందుకు వెళుతున్నాడు.భూ ఆక్రమణ విచారణలో అధికారులు.ఆ నాయకుడు కుమ్మక్కవుతున్నారా.చేపట్టాల్సిన అధికార యంత్రాంగం,రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిదర్శనం. బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ గురువారం కాశినాయన మండలంలోని ఇటుకులపాడు,నాయనపల్లె గ్రామాల్లో భూములపై విచారణ చేపట్టారు.అయితే,ఆ అధికారిక పర్యటనలో స్థానిక టీడీపీ నాయకుడు ఆర్డీఓ వెంటే ఉండి చక్రం తిప్పడం ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్‌గా మారింది.బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ భూ సమస్యపై ఎక్కడికి వెళ్లినా ఆ నాయకుడు అక్కడ ఉండవలసిందే.సర్వే నంబర్ల పరిశీలన నుంచి మండల కేంద్రమైన నరసాపురంలోని స్మార్ట్ కిచెన్ తనిఖీల వరకు, ఆర్డీఓ ఎక్కడికి వెళ్తే అక్కడ టిడిపి నాయకులు ప్రత్యక్షమవుతున్నారు. మెజిస్ట్రేట్ స్థాయి అధికారి విచారణ చేస్తున్నప్పుడు కేవలం రెవెన్యూ సిబ్బంది,సర్వేయర్,పంచనామా సాక్షులు మాత్రమే ఉండాలి. కానీ, ఎటువంటి ప్రభుత్వ హోదా లేని రాజకీయ నాయకులకు అధికారుల పక్కనే ఉంటూ విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు.గతంలో నాయనపల్లె గ్రామ పొలంలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి ఆక్రమణకు గురైన వ్యవహారంలోను.నాడు విచారణకు వచ్చిన అధికారుల వెంట అప్పుడు కూడా ఈ నాయకుడే కనపడుతున్నాడని. ప్రజల్లో పలు విమర్శలు వినిపిస్తున్నాయి.రెవెన్యూ మాన్యువల్ ప్రకారం వివాదాస్పద స్థలాల పరిశీలనలో రాజకీయ జోక్యం ఉండకూడదని తెలిసినప్పటికీ ఆర్డీఓ చంద్రమోహన్ నిబంధనలు విస్మరించి రాజకీయ నేతలను వెంట పెట్టుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అధికారులు.రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారా అనే అంశంపై మండలంలోని ప్రజల్లో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా జిల్లా ఉన్నతాధికారులు ఆ నాయకునిపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.