అధికారుల నిర్లక్ష్యంతో కోటగిరి దామర చెరువు దీనదుస్థితి.
తూము పనిచేయక ఆయకట్టు రైతులు ఆందోళనలు.
24 గంటల్లో మరమ్మత్తు చేయకపోతే కలెక్టర్‌ను కలుస్తాం.
ఆయకట్టు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం.
చెరువుతూము మరమ్మత్తు చేయాలని డిమాండ్.
బీఆర్ఎస్ నాయకులు తేల్ల రవి కుమార్
కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి మండల కేంద్రంలోని దామర చెరువు దుస్థితిపై ఇరిగేషన్ అధికారులు,జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలనీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకు లు తేల్ల రవి కుమార్ డిమాండ్ చేశారు.బుధవారం ఆయన మండల బీఆర్ఎస్ నాయకులు,ఆయకట్టు రైతులతో కలిసి చెరువుతూమును పరిశీలించారు.ఈ సందర్భంగా తేల్ల రవి కుమార్ మాట్లాడుతూ.గత 4 సం.లుగా చెరువు తూము పరిస్థితిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు.గత ఏడాది కూడా తూము పరిస్థితి అగమ్యగోచరంగా ఉండటం తో రైతులు తమ సొంత డబ్బులతో తాత్కాలిక మరమ్మతు లు చేయించుకున్నారని తెలిపారు.వర్షాకాలం ప్రారంభంలో (ఓఏండి) ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద చెరువుల మర మ్మతులకు ప్రతిపాదనలు పంపాల్సి ఉండగా ఇక్కడి ఇరిగేషన్ అధికారులు కనీస ప్రతిపాదనలు కూడా పంపారో లేదో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో ప్రభుత్వం ఓఎండి కింద చెరువులకు కావలసిన మరమ్మత్తుల నిధుల గురించి ప్రతిపాదనలు పంపమని కోరడం జరుగుతుంది.కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపారో లేదో అనేది వారి విజ్ఞతకే తెలివాలని అన్నారు.ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారి రవికుమార్ ఇటీవల కొత్తగా వచ్చారని.గతంలో పనిచేసినటువంటి ఇక్కడి ఇరిగేషన్ అధికారి సత్యనారాయణ చెరువు గురించి ప్రతిపాదనలు పంపారో లేదో తెలియదు కానీ సత్యనారా యణ ఇక్కడ నుండి బదిలీపై వెళ్లి 20 రోజులు కావస్తున్నా కొత్తగా వచ్చిన రవికుమార్ కు ఇక్కడ బాధ్యతలు ఇవ్వక పోవడం బాధాక రమని అన్నారు.ప్రస్తుతం వర్షాలకు చెరు వు పూర్తిగా నిండి తూము మాత్రం కింద ఇరుక్కుపోవడం తో పైకి వచ్చే పరిస్థితి లేదనీ.దీంతో సుమారు 50 ఎకరాల ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రైతాంగ సమస్యలపై జిల్లా అధికారులు,ఇరిగేషన్ ఎస్సీ,ఈఈ అధికారులు తక్షణమే స్పందించి 24 గంటల్లో తూము మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేస్తామని హెచ్చరించారు.అలా గే ఈ ప్రాంత రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటు సమస్య పరిష్కారానికి కృషి చేస్తాదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్,నజీర్, రుద్రంగి సందీప్,మంజునా థ్,వడ్ల ఉమాకాంత్,రైతులు బి.సాయిలు,వడ్ల శ్యామ్,నల్ల గంగాధర్,గుండ్ల సాయిలు, రాములు,నవీన్,తదితరులు పాల్గొన్నారు.