అధికారుల నిర్లక్ష్యంతో ఇసుక దందా జోరు

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): చిగురుమామిడి మండలంలోని రామంచ వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీలు, టిప్పర్లతో పగటిపూటే ఇసుకను భారీగా తవ్వి తరలిస్తున్నారని రామంచ సర్పంచ్ కిషన్ రెడ్డి, రైతులు ఆరోపిస్తున్నారు. పూడికతీత పేరుతో బహిరంగంగా జరుగుతున్న ఈ తవ్వకాలపై ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్ కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ, భారీ యంత్రాలతో వాగు తవ్వడం వల్ల సహజ ప్రవాహం దెబ్బతింటోందని, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడే...