అధికారుల’ముడుపుల’మౌనం.ఫుట్‌పాత్‌లపై అక్రమార్కుల రాజ్యం! కథనాలపై కథనాలు వస్తున్నా కదలని రెవెన్యూ, R&B, పంచాయతీ రాజ్ యంత్రాంగం
పోరుమామిళ్లలో కాలినడకన వెళ్లాలంటేనే ప్రజల ప్రాణసంకటం! పోరుమామిళ్ల,ఆగస్టు01 ప్రజావాణి,కడప జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన పోరుమామిళ్ల పట్టణంలో నిబంధనలు తుంగలో తొక్కుతూ రోడ్లు,ఫుట్‌పాత్‌లను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నా.బాధ్యత గల అధికారులు మాత్రం గుర్రపు నిద్ర నటిస్తున్నారు.పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన,కాలినడకన వెళ్లేందుకు కేటాయించిన ఫుట్‌పాత్‌లపై ఇబ్బడిముబ్బడిగా వెలిసిన దుకాణాల వల్ల సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఈ దారుణాలపై స్థానిక మీడియాలో వరుస కథనాలు వస్తున్నప్పటికీ,అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీ ఎత్తున'ముడుపులు' చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడుగు తీసి...