prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 1:04 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

అది పులి కాదు, పిల్లి జంగవిల్లి

అది పులి కాదు, పిల్లి జంగవిల్లి

నిర్ధారించిన అటవీ శాఖ అధికారి గీరయ్య

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 06 (ప్రజావాణి)

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామంలోని “ఎర్రగుంట” ప్రాంతంలో శుక్రవారం రోజున కలకలం రేపిన చిరుత సంచారం అనే వినికిడి అపోహ మాత్రమే, నిజం కాదని అటవీ శాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎ గీరయ్య తేల్చి చెప్పారు. ఆయన వారి సిబ్బందితో పరిశీలించి తేల్చి చెప్పిన నిజాలు ఏమిటంటే, అక్కడ కనిపించిన అడుగులు అడవి పిల్లి (జంగ విల్లి) గా నిర్ధారించారు, అది చూడడానికి పులి లాగే కనిపిస్తుందని, అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతంలో అడవి జంతువు “నక్క” అడుగులు కూడా గుర్తించినట్టు ఆయన తెలిపారు. వదంతులు నమ్మి ప్రజలు పులి అని భ్రమపడ్డారని ఇలాంటి అపోహల నమ్మి ప్రజలు భయపడవద్దని నిజానిజాలు తెలుసుకోవాలని వివరించారు. అక్కడి ప్రజలు పొగ మంచు (లక్క పొగ) కమ్ముకోవడం వల్ల అడవి పిల్లి చారలను చూసి పులి అని భ్రమ పడినట్లు తెలిపారు. ఇటీవల ధర్మారం మండలంలో పులి సంచరిస్తున్న వార్తను మదిలో ఉంచుకొని ఇది, అదే పులి అని భ్రమపడ్డట్లు తెలుస్తోందని వివరించారు, ఏది ఏమైనప్పటికి పులి, గిలి ఏది లేదని తేల్చి చెప్పారు, రైతులు ఎప్పటిలాగే వారి రోజువారి కార్యకారపాలను కొన సాగించవచ్చని తేల్చి చెప్పారు.