అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల శిక్ష, 6 వేల జరిమానా

జగిత్యాల జిల్లా వెల్గటూర్ పరిధిలో 2024లో మహిళపై అత్యాచారానికి పాల్పడిన గంగుల సనత్ కుమార్‌కు కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానా విధించింది. న్యాయమూర్తి జి సునీత రవీంద్ర రెడ్డి ఈ కీలక తీర్పునిచ్చారు. పోలీసుల పటిష్ట దర్యాప్తు, పీపీ నర్సయ్య వాదనలతో నేరం రుజువైంది. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు వేధింపులపై నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని, నేరగాళ్లకు శిక్ష తప్పదని హెచ్చరించారు.