అడవికోడియంబేడులో ఇసుక మాఫియా బీభత్సం”ఇతర రాష్ట్రాల గ్యాంగ్ దండయాత్ర… అడవికోడియంబేడు వాగు గర్భం దోపిడీ!

తిరుపతి జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14) పిచ్చాటూరు మండలం అడవికోడియంబేడులో ఇసుక మాఫియా బీభత్సం.ఇతర రాష్ట్రాల గ్యాంగ్ దండయాత్ర.అడవికోడియంబేడు వాగు గర్భం దోపిడీ!రాత్రి వేళల్లో భారీ టిప్పర్లతో తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణాఅధికారుల మౌనంపై గ్రామస్తుల ఆగ్రహం!అడవికోడియంబేడు ప్రాంతంలో ఇసుక మాఫియా బీభత్సం సృష్టిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు స్థానికులతో కలిసి ఇక్కడ మట్టి–ఇసుక మాఫియాను నడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం అయ్యప్ప నాయుడు కండ్రిగ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి గత రెండు నెలలుగా వాగులో...