prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 3:28 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అడవికోడియంబేడులో ఇసుక మాఫియా బీభత్సం”ఇతర రాష్ట్రాల గ్యాంగ్ దండయాత్ర… అడవికోడియంబేడు వాగు గర్భం దోపిడీ!

తిరుపతి జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14) పిచ్చాటూరు మండలం అడవికోడియంబేడులో ఇసుక మాఫియా బీభత్సం.ఇతర రాష్ట్రాల గ్యాంగ్ దండయాత్ర.అడవికోడియంబేడు వాగు గర్భం దోపిడీ!రాత్రి వేళల్లో భారీ టిప్పర్లతో తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణాఅధికారుల మౌనంపై గ్రామస్తుల ఆగ్రహం!అడవికోడియంబేడు ప్రాంతంలో ఇసుక మాఫియా బీభత్సం సృష్టిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు స్థానికులతో కలిసి ఇక్కడ మట్టి–ఇసుక మాఫియాను నడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం అయ్యప్ప నాయుడు కండ్రిగ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి గత రెండు నెలలుగా వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తోంది.ఉదయం సమయంలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా,రాత్రి వేళల్లో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ టిప్పర్లలో ఇసుకను లోడ్ చేసి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లు ఈ అక్రమ రవాణాలో పాల్గొంటున్నాయని సమాచారం.గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు నది పరిధిలో ఇసుక తవ్వకాలకు నిషేధం విధించినప్పటికీ, ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా మాఫియా యంత్రాలతో వాగు గర్భాన్ని ఛిద్రం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలు, పొక్లెయిన్లతో నదిలోనే రోడ్లు వేసి ఇసుకను దోచుకుంటున్నారు.అక్రమ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే “మాకు అన్ని అనుమతులు ఉన్నాయి.మా వెనుక పెద్దల అండ ఉంది”అంటూ మాఫియా బెదిరింపులకు దిగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ అక్రమ దందా కళ్లముందే కొనసాగుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భూగర్భ జలాలు పడిపోవడంతో భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.అడవికోడియంబేడు ప్రజల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.