అట్లూరు క్రాస్ రోడ్డులో విస్తృతంగా వాహనాల తనిఖీలు: ఎస్సై నాగ కీర్తన

కడప జిల్లా అట్లూరు జూలై 31ప్రజావాణి మండలంలోని అట్లూరు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) నాగ కీర్తన ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రహదారిపై వెళ్తున్న పలు వాహనాలను ఆపి,వాటికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ట్రాఫిక్ నిబంధనలుతప్పనిసరి:వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్సై నాగ కీర్తన వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె కోరారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తమ...