అట్టహాసంగా మాలల ఆత్మీయ సమ్మేళనం – దళిత హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం: నల్లి రాజేష్

బద్వేల్ జూన్ 22ప్రజావాణి నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల మాలలతో పోరుమామిళ్ల పట్టణంలోని చిత్త విజయ ప్రతాప్ రెడ్డి గార్డెన్‌లో మాల మహానాడు కడప జిల్లా అధ్యక్షుడు జక్కుల కిరణ్ ఆధ్వర్యంలో “మాలల ఆత్మీయ సమ్మేళనం” అట్టహాసంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ హాజరయ్యారు.ముందుగా స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోటపోతుల...