prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:08 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అట్టహాసంగా మాలల ఆత్మీయ సమ్మేళనం – దళిత హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం: నల్లి రాజేష్

బద్వేల్ జూన్ 22ప్రజావాణి నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల మాలలతో పోరుమామిళ్ల పట్టణంలోని చిత్త విజయ ప్రతాప్ రెడ్డి గార్డెన్‌లో మాల మహానాడు కడప జిల్లా అధ్యక్షుడు జక్కుల కిరణ్ ఆధ్వర్యంలో “మాలల ఆత్మీయ సమ్మేళనం” అట్టహాసంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ హాజరయ్యారు.ముందుగా స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోటపోతుల విజయరాజు అధ్యక్షతన సభ నిర్వహించబడింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం,ఎస్సీ ఉపవర్గీకరణ అమలు,రాష్ట్రవ్యాప్తంగా మాలలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందిస్తూ జాతికి బలమైన సందేశాన్ని అందించారు.దళితుల హక్కుల సాధన కోసం పోరాటం మరింత బలపడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి ముత్యాల జార్జ్,రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గుండె నగేష్ బాబు,రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడెంచెరువు సంపత్ కుమార్,సుంకర రాజేష్,సరేళ రఘు,పోరుమామిళ్ల జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్తో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.