prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 4:29 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా బి. తిరుపతి రావు

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బి. తిరుపతి రావు నియమితులయ్యారు.శనివారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, ఓబీసీల హక్కుల సాధన కోసం, సామాజిక, విద్య, ఆర్థిక మరియు రాజకీయ పురోగతి కోసం తిరుపతి రావు చురుగ్గా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల కాలపరిమితి వరకు కొనసాగుతారని నియామక పత్రంలో పేర్కొన్నారు.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షులకు తిరుపతి రావు కృతజ్ఞతలు తెలిపారు.వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మరియు యువతను సంఘటితం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు