prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 5:59 am Digital Edition : PRAJA VANI

*అక్రమ సంబంధం కోసం అమానుషం..* <br><br>భార్య ఇద్దరు బిడ్డల హత్య! ఆత్మహత్య అనేది మిస్టరీ!<br>

*అక్రమ సంబంధం కోసం అమానుషం..*

భార్య ఇద్దరు బిడ్డల హత్య! ఆత్మహత్య అనేది మిస్టరీ!

చెన్నారావుపేట మార్చి 31 (ప్రజావాణి)

అక్రమ సంబంధం మోజులో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కన్నబిడ్డలను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకున్నాడనీ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. హైదరాబాద్‌లోని మూసాపేట పరిసరాల్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్ పదహారు చింతల తండాకు చెందిన స్రవంతిని 14 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమారులు
కొన్నేళ్లుగా సాఫీగా సాగిన వీరి సంసారంలో రెండేళ్ల క్రితం మరో మహిళ ప్రవేశించింది. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రవీణ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడనీ ఈ క్రమంలో సదరు మహిళను రెండో వివాహం కూడా చేసుకున్నానీ అన్నారు దీంతో దంపతుల మధ్య గొడవలు ముదిరాయి. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినా ప్రవీణ్ పద్ధతి మార్చుకోలేదు. రెండు రోజుల క్రితం నర్సంపేటలో జరిగిన పంచాయతీలో.. ఇకపై గొడవలు పడనని బాధ్యత నాదేనని బాండ్ పేపర్ రాసి ఇచ్చి భార్య పిల్లలను తీసుకెళ్లాడు.అయితే ఇది పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు అనుమానం ఉందని స్రవంతి బంధువులు అన్నారు. సోమవారం హైదరాబాద్ చేరుకున్న ప్రవీణ్ మంగళవారం రాత్రి భార్యను చిత్రహింసలకు గురిచేసి ఉండొచ్చని అనంతరం బిర్యానీలో విషం కలిపి భార్య ఇద్దరు కుమారులకు తినిపించి చంపేశాడని ఎవరికీ అనుమానం రాకుండా వారిని ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.విషయం తెలిసిన స్రవంతి బంధువులు ఆగ్రహంతో ఊగిపోతూ మాణిక్యం తండాలోని ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు. అక్కడ ఉద్రికత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు సకాలంలో చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.పోలీసుల విచారణలో ఇది హత్య, ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నెక్కొండ సిఐ శ్రీనివాస్, చెన్నారావుపేట ఎస్ఐ రాజేష్ రెడ్డి తెలిపారు.ఈ దర్యాప్తులో నెక్కొండ ఎస్సై మహేందర్, నర్సంపేట ఎస్సై గూడ అరుణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లి సహ పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.