prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 7:42 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అక్రమ సంపాదనకు పాల్పడుతున్న సంకల్ప కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ

పోరుమామిళ్ల,జూన్ 25ప్రజావాణి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం మండల విద్యాశాఖ అధికారి ( ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న సంకల్ప కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని  MEO)ఓబులేసు కి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి.అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ.ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మూడో తరగతి నుండి ఏడో తరగతి వరకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని సంకల్ప కోచింగ్ సెంటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి అని వారన్నారు.చదువుని వ్యాపారంగా మార్చుకున్న యాజమాన్య ప్రవర్తన విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉందని వారన్నారు.ప్రభుత్వ బడుల్లో విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయులే తెర వెనకాల ఉండి సంకల్ప కోచింగ్ సెంటర్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నయవంచన చేసి వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క పోరుమామిళ్ల లో అదే ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ సంపాదనకు పాల్పడడం కోసం ఇలా కోచింగ్ సెంటర్ల పేరుతో వేల,లక్షల రూపాయలు దోపిడీ చేయడం నేరమని వారన్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయుల ఈ విధంగా ప్రవర్తిస్తుంటే భవిష్యత్తులో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమవుతారని,చదువు కూడా దక్కదని అన్నారు.దీనిపైన వెంటనే విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి సంకల్ప కోచింగ్ సెంటర్ వెంటనే సీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేసి ఎవరైతే యాజమాన్యం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో వారి పైన కూడా సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరుమామిళ్లలో ఆందోళన కార్యక్రమం చేపడతామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వెంకటరమణ,మరియు కార్యకర్తలు,రియాజ్,సుదర్శన్,నిశాంత్,వలి,సుబ్రహ్మణ్యం,పవన్ తదితరులు పాల్గొన్నారు.