అక్రమ వైన్ తయారీ కేంద్రంపై ఎక్సైజ్ శాఖ దాడులు.. 377.7 లీటర్ల వైన్ స్వాధీనం

మల్కాజ్‌గిరి, జూలై 9: మల్కాజ్‌గిరి జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్న భారీ మొత్తంలో వైన్‌ను స్వాధీనం చేసుకుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. ప్రణవి ఆదేశాలు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. హనుమంతరావు సూచనల మేరకు జూలై 7వ తేదీ రాత్రి టాస్క్‌ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించింది. దాడుల్లో ద్రాక్ష, అనానస్, గువ్వ, మోసంబి, సపోటా, అరటి, తమలపాకు తదితర ఫలాలతో తయారు చేసిన ఏడు...