prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 9:27 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవు – రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్థి జగన్ మోహన్ రాజు హెచ్చరిక..!!

ప్రజావాణిన్యూస్(మార్చి20) రాజంపేట మున్సిపాలిటీ గేట్ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హెచ్చరించారు. మున్సిపాలిటీ గేట్ వసూల్ చేస్తున్న కాంట్రాక్టర్ ఓ మహిళా చిరు వ్యాపారి వద్ద అక్రమంగా 40 రూపాయలు వసూలు చేశారని జగన్మోహన్ రాజుకు ఫిర్యాదు చేశారు.దీంతో మార్కెట్ లో పర్యటించిన జగన్ మోహన్ రాజు చిరు వ్యాపారులతో మాట్లాడి మున్సిపల్ గేట్ ఎంత వసూలు చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. రెండు రూపాయలు రాబట్టాల్సినచోట 40 రూపాయలు రాబడుతున్నారని వ్యాపారస్తులు వాపోయారు. దీంతో చలించి పోయిన టీడీపీ ఇంచార్జ్ 4000 మంది చిరు వ్యాపారులకు ఏప్రిల్ ఒకటవ ఏది వరకు వారందరి గేట్ డబ్బులు రాజంపేట మున్సిపాలిటీకి ఆయన చెల్లించారు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత గేట్ కాంట్రాక్టర్లు సక్రమంగా వసూలు చేయాలని ఆదేశించారు. అలా కాదని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. రాజంపేటలో అక్రమంగా ఎవరైనా దోపిడీకి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.