prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 4:51 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అక్రమ లేఅవుట్ నిర్మాణాలు పట్ల ప్రజలు -అప్రమత్తంగా ఉండాలి!

ఎన్టీఆర్ జిల్లా(జూన్ 06) ప్రజావాణి జగ్గయ్యపేట నియోజకవర్గం,కొంగర మల్లయ్యగట్టు పరిధిలో భీమవరం గ్రామపంచాయతీ పరిధిలో.అనేకప్రాంతాల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా లేఅవుట్ వెంచర్ నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది.సొంత ఇంటి కలలు, సొంత స్థలం (జాగ) కలలు నెరవేర్చుకోవాలనే ఆశతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నా ప్రజలుఎటువంటి పర్మిషన్ లేని లేఅవుట్‌ లలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.అందువల్ల ప్రజలు పూర్తిగా జాగ్రత్తగా ఉండి, ఎప్పుడూ DTCP లేదా RERA అనుమతులు ఉన్న లేఅవుట్‌లలోనే ప్లాట్లు కొనుగోలు చేయడం మంచిది.సరైన డాక్యుమెంట్లు చెక్ చేయకుండా కొనుగోలు చేయడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది .కాబట్టి, ఇలాంటి అనుమతులు లేని లేఅవుట్‌లలో పెట్టుబడి పెట్టకుండా అప్రమత్తంగా ఉండాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.నియోజకవర్గంలో.సీఆర్డీఏ అనుమతులు లేని అక్రమ వెంచర్లు.సొంతింటి కల నిజం చేసుకునే వారి అవకాశాన్ని ఆసరాగా చేసుకొని వారి నెత్తిన కుచ్చుటోపి పెట్టేందుకు చూస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.అనుమతి లేని అక్రమ వెంచర్లు, స్ధలాలు కొనుగోలు చేయరాదని అలా కొనుగోలు చేసిన వెంచర్లను రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తామని హెచ్చరించారు సీఆర్డీఏ అధికారులు.మండలాల్లో నూతనంగా వెలిసిన సీఆర్డీఏ అనుమతి లేని వెంచర్లు.కమిషన్ ఎజెంట్ మాట విని అనుమతులు లేని వెంచర్లు,ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయవద్దని సూచిస్తున్న అధికారులు. అనుమతులు లేని వెంచర్లు కొనుగోలు చేస్తే యాజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియ పరిచారు అధికారులు.అనుమతి లేని వెంచర్లపై ప్రత్యేక కథనాలతో.మీ ప్రజావాణి ముందుకు తీసుకొస్తుంది