అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని డ్రైనేజ్ కనెక్షన్లపై ప్రజావాణిలో ఫిర్యాదు
ఘట్కేసర్, మే 4 (ప్రజావాణి): ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు, అనుమతి లేకుండా డ్రైనేజ్ కనెక్షన్లు కలుపుతున్న ఘటనలు కొనసాగుతున్నాయని మాజీ సర్పంచ్ వేముల సంజీవ్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం, గ్రామంలో ఎలాంటి అధికార అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, ఆ భవనాలకు సంబంధించి డ్రైనేజ్ కనెక్షన్లు కూడా అనధికారికంగా ప్రధాన లైన్లకు కలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఫోన్ ద్వారా, అలాగే ఏప్రిల్...