అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ ఉక్కుపాదం.. తొమ్మిది భవనాలు సీజ్

ఘట్‌కేసర్, జూలై 25: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం వార్డులో యన్నంపేట్–నారాపల్లి ప్రాంతాల్లో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న భవన యజమానులపై టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసి నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ, కొందరు యజమానులు సెలవు దినాల్లో అక్రమంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గతంలో పలుమార్లు కూల్చివేతలు నిర్వహించినా నిబంధనలను ఉల్లంఘిస్తూ పనులు కొనసాగించడంతో శనివారం పోలీసుల సహకారంతో మొత్తం తొమ్మిది అక్రమ నిర్మాణాలను సీజ్...