అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం..! గాగ్గిల్లాపూర్ వద్ద ట్రాక్టర్, ట్రైలర్ స్వాధీనం – ఇద్దరిపై కేసు నమోదు

  బెజ్జంకి,జూలై16 (ప్రజావాణి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగ్గిల్లాపూర్ స్టేజ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్, ట్రైలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తోటపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ గొల్ల రాజ్‌కుమార్, వాహన యజమాని ఉల్లి నరేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై తోట తిరుపతి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఇటువంటి అక్రమ కార్యకర్తల పాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్...