అక్రమాలకు పాల్పడుతున్న అమృత సాయి విద్యానికేతన్ పై చర్యలు తీసుకోవాలి: – ఏ.ఐ.ఎస్.బి
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) అట్లూరు మండల పరిధిలోని అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతుందని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్ నందు గ్రీవెన్స్ లో డి.ఆర్.ఓ కు పిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.అట్లూరు మండలంలోని అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థి జయంత్...