prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 1:42 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అక్రమాలకు పాల్పడుతున్న అమృత సాయి విద్యానికేతన్ పై చర్యలు తీసుకోవాలి: – ఏ.ఐ.ఎస్.బి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) అట్లూరు మండల పరిధిలోని అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతుందని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్ నందు గ్రీవెన్స్ లో డి.ఆర్.ఓ కు పిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.అట్లూరు మండలంలోని అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థి జయంత్ శ్రావణ్ కు అడ్మిషన్ పెట్టుకొని తరగతులకు మాత్రం బద్వేలు లోని శ్రీ లక్ష్మీ విద్యారణ్య స్కూల్ లో హాజరవ్వడం జరిగిందని వారు తెలిపారు. అక్కడ వచ్చిన మార్కులను తమ పాఠశాలలో వచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న అమృత స్కూల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాల రెన్యువల్ గడువు ముగిసిన యధావిధిగా తరగతులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. క్వాలిఫై లేని అధ్యాపకులను నియమించుకుని వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్న అమృత సాయి విద్యానికేతన్ స్కూల్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు