prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 12:17 pm Digital Edition : RAJASHEKARREDDY

అక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలం.. హద్దులు ఏర్పాటు చేసి ప్రజా అవసరాలకు వినియోగించాలంటున్న గ్రామస్తులు

అక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలం అని గ్రామస్తుల వినికిడి

హద్దులు ఏర్పాటు చేసి ప్రజా అవసరాలకు వినియోగించాలంటున్న గ్రామస్తులు

బెజ్జంకి, మే 14(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో సర్వే నంబర్లు 60, 61లో ఉన్న ప్రభుత్వ స్థలం హద్దులు లేకపోవడంతో అక్రమణలకు గురవుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమికి స్పష్టమైన హద్దులు లేకపోవడంతో కొంతమంది ఆక్రమణలకు పాల్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో గతంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌కు గ్రామస్తులు వినతిపత్రం అందజేసి ప్రభుత్వ స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ స్థలాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం స్థలం మంజూరు,చేయాలని గ్రామస్తులు చర్చించుకుంటున్నారుస్థానిక సర్పంచ్‌తో పాటు మండల రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమికి తక్షణమే హద్దులు ఏర్పాటు చేసి అక్రమణలను నివారించాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని వేడుకుంటున్నారు.