వై.ఎస్.ఆర్ కడప జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) కడప జిల్లాలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలి.విజిబుల్ పోలీసింగ్ పెంచాలి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎన్ఫోర్స్మెంట్ తో పాటు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి మైదుకూరు పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం కడప జిల్లాలో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని,రౌడీల ఆట కట్టించి శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఎక్కడా రౌడీయిజం,గంజాయి లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మైదుకూరు సబ్ డివిజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయించే (బెల్ట్) షాపులపై కఠినంగా వ్యవహరించాలని,విస్తృతంగా దాడులు చేసి పట్టు బడ్డ వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్.పీ గారు ఆదేశించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్.పీ ఆదేశించారు.వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై,హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణాన్ని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు.వాహనాల రికార్డులు తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్.పీ ఆదేశించారు.పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారంట్ లను త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు.
‘శక్తి’ టీముల డే బీట్స్ పర్యవేక్షిస్తూ స్కూళ్ళు,కాలేజీలు, ఆఫీస్ లు,వ్యాపార సముదాయాల వద్ద,రద్దీ ప్రాంతాలలో తప్పనిసరిగా పోలీస్ సిబ్బంది బీట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.స్కూళ్ళు,కాలేజీలలో ‘మహిళా భద్రత’పై, సోషల్ మీడియా వల్ల కలిగే మహిళలు, బాలికల వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు.రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని,మట్కా, క్రికెట్ బెట్టింగ్,గ్యాంబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్పో లీస్ అధికారులను ఆదేశించారు.రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడినవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని,వారి కదలికలపై నిఘాపై ఉంచి సమాచారముంటే వారు నేరం చేయకముందే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఐ.పీ.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో గతంలో బెట్టింగ్ కేసుల్లో ఉన్న వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని,ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ బెట్టింగ్ కు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూ వివాదాలు,ఆర్ధిక పరమైన అంశాల వలన క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల మరియు లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.డ్రోన్ కెమెరాల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా రిసెప్షనిస్ట్ ల ద్వారా మహిళల సమస్యలపై వచ్చే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దొంగతనాల నేర చరిత్ర కలిగిన వారి కదలికలపై నిఘా ఉంచాలని,వివిధ రకాలైన, వివిధ ప్రాంతాలలో జరిగే దొంగతనాలను మ్యాపింగ్ చేసి సదరు ప్రాంతాలలో గస్తీ ముమ్మరం చేయాలన్నారు.గ్యాంబ్లింగ్,మట్కా,క్రికెట్ బెట్టింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని,దాడులు ఉధృతం చేయాలని ఆదేశించారు.ఏ.పి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ మేరకు షాపులు లాడ్జిలు,హోటళ్లు,వాణిజ్య సముదాయాలు,అపార్ట్ మెంట్లు తదితర జన సమ్మర్థమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సి.సి కెమెరాలు అమర్చుకుని,వాటి పనితీరుపై శ్రద్ద వహించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.సమావేశంలో మైదుకూరు డి.ఎస్.పి జి.రాజేంద్ర ప్రసాద్స బ్ డివిజన్ లోని సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.