prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 9:31 pm Digital Edition : PRAJA VANI

అక్రమంగా ఇసుక తవ్వకాలు

అక్రమంగా ఇసుక తవ్వకాలు

తవణంపల్లి మే 30 ప్రజావాణి : అక్రమంగా ఇసుక త్రవ్వకాలు చేపడుతున్న ఐదు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ తెలిపారు. ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలంలోని  గోవింద్ రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పిల్లలంక చెక్జాం వద్ద బంగారుపాళ్యం మండలం పెట్టేది గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ బాబు ఇసుక అక్రమ త్రవ్వకాలతో టిప్పర్ లోడ్ చేస్తూ ఉన్నాడని, మరో ఇద్దరు టిప్పర్ డ్రైవర్లు రాగి మాను పెంటకు చెందిన మధుబాబు నాయుడు, సెట్టేరి కి చెందిన గిరి, హిటాచి యంత్రం డ్రైవర్ బీహార్ కు చెందిన నితీష్ కుమార్ లతో పాటు మూడు టిప్పర్లు ఒక హిటాచి వాహనానికి యజమాని అయిన హరి ప్రసాద్ నాయుడును అరెస్టు చేసి టిప్పర్లు హిటాచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.