అకాల వర్షాలతో దెబ్బతిన్న అరటి పంటను పరిశీలించిన కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,

ప్రజావాణిన్యూస్(మార్చ్20)బద్వేలు,పోరుమామిళ్ల,కాశినాయన,కలసపాడు మండలాల్లో విస్తృతంగా పండ్ల తోటలు సాగు చేయబడుతున్నాయి.ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అరటి పంట ప్రధానంగా సాగు అవుతోంది. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు,ఈదురు గాలుల కారణంగా రైతులకు చేతికి వచ్చిన అరటి పంట తీవ్రంగా దెబ్బతిన్నది.ఈ నేపథ్యంలో కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు కాశినాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.అలాగే ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి...