అంబేద్కర్ 271వ  నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొన్న యార్కల శివ నాగరాజ్ గౌడ్

ఘట్‌కేసర్, జూన్ 21: ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న 271వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఘట్‌కేసర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యార్కల శివ నాగరాజ్ గౌడ్ (ఉప సర్పంచ్, రాయరావుపేట, బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా), వై ప్రకాష్, ఆర్ ఆనంద్ (వార్డు సభ్యులు, రాయరావుపేట) హాజరై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యార్కల శివ...