prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 3:27 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

అంబేద్కర్ 271వ  నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొన్న యార్కల శివ నాగరాజ్ గౌడ్

ఘట్‌కేసర్, జూన్ 21: ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న 271వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఘట్‌కేసర్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యార్కల శివ నాగరాజ్ గౌడ్ (ఉప సర్పంచ్, రాయరావుపేట, బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా), వై ప్రకాష్, ఆర్ ఆనంద్ (వార్డు సభ్యులు, రాయరావుపేట) హాజరై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా యార్కల శివ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రపంచం మొత్తం భారతదేశాన్ని గౌరవంగా చూడటానికి కారణం దేశంలోని ప్రజాస్వామిక విలువలేనని, ఆ విలువలకు మూలాధారం భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. ప్రతి వారం భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చేయించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ కృషి అభినందనీయమని అన్నారు.

ఘట్‌కేసర్‌లో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య పూలమాల కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొంది తాను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. సమాజ సేవా భావనను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామి కావడం తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. అనంతరం “జై భీమ్ – జై మీం” నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మేకల దాసు (అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం), కట్కూరి నర్సింగ్ రావు, బండారి రాందాస్ (అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం, ఈడబ్ల్యూఎస్ కాలనీ), రామోజీ (బీజేపీ నాయకులు), కె. సత్యం, ఉటుకూరి అశోక్ గౌడ్, మీసాల రాజేష్ కుమార్, కడప రవి, జి. అంజయ్య, కడుపోళ్ల నర్సింగరావు, డి. శ్రీకాంత్, ఎస్. కృష్ణంరాజు, ఇ. విష్ణు, సుదర్శన్, నవీన్, శివకృష్ణ, అబి సందేశ్, కడప నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.