అంబేద్కర్ స్ఫూర్తి ప్రజల్లోకి తీసుకెళ్లాలి: షేక్ సలీం

ఘట్‌కేసర్ జూన్ 7: ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో, మీసాల అరుణ్ కుమార్ నేతృత్వంలో డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 269వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకుడు షేక్ సలీం హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ, ప్రతి వారం అంబేద్కర్‌ను స్మరించుకోవడం సంతోషకరమైన విషయమని, ఇలాంటి కార్యక్రమాలు ఘట్‌కేసర్‌కే పరిమితం కాకుండా గ్రామ గ్రామాన నిర్వహించాలని...