prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 10:38 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

అంబేద్కర్ స్ఫూర్తి ప్రజల్లోకి తీసుకెళ్లాలి: షేక్ సలీం

ఘట్‌కేసర్ జూన్ 7: ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో, మీసాల అరుణ్ కుమార్ నేతృత్వంలో డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 269వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకుడు షేక్ సలీం హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ, ప్రతి వారం అంబేద్కర్‌ను స్మరించుకోవడం సంతోషకరమైన విషయమని, ఇలాంటి కార్యక్రమాలు ఘట్‌కేసర్‌కే పరిమితం కాకుండా గ్రామ గ్రామాన నిర్వహించాలని సూచించారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీల కోసమే కాకుండా భారతదేశంలోని ప్రతి పౌరుడి కోసం రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ద్వారా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించబడుతున్నాయని, రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్న ప్రతి ఒక్కరికీ అంబేద్కర్ చేసిన సేవలను తెలియజేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత రిజర్వేషన్ స్థానాలకు మాత్రమే పరిమితం కాకుండా జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీ పడే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మేకల దాస్ (అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం), అజ్జు, ఫయాజ్, ఫర్హాన్, కట్కూరి నర్సింగ్ రావు (అధ్యక్షుడు, గంగపుత్ర సంఘం, ఘట్‌కేసర్ మున్సిపాలిటీ), బండారి రాందాస్ (అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం, ఈడబ్ల్యూఎస్ కాలనీ), మీసాల రాజేష్ కుమార్ (అధ్యక్షుడు, ఎస్సీ సెల్, బీఆర్ఎస్, పోచారం మున్సిపాలిటీ), కడప రవి, తోట శ్రీనివాస్, బాలనగరం గణేష్ గౌడ్, ఈ. విష్ణు, ఎం. భరత్ తదితరులు పాల్గొన్నారు.