
మార్కాపురం.ప్రజావాణి న్యూస్)జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ జ్ఞాని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనాన్ని ఏర్పాటు చేయాలని బహుజన సంఘం నాయకులు నందం శేఖర్ కోరారు.శనివారం న శుభం కన్వెన్షన్ హాలు లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ నందు కలెక్టర్ విజయ సునీతను కలసి వినతి పత్రం అందజేశారు..ఈ నేపద్యంలో నందం శేఖర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం పరిసర ప్రాంతంలో నిరుపేదలైన దళితులు అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నారని తెలిపారు.ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే అధిక వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉందని పేర్కొన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం ఏర్పాటు చేస్తే కొంతమేరకు శుభకార్యాలు చేసుకొనుటకు వారికి తోడ్పాటు అందించిన వారవుతారని వెల్లడించారు.సామాజిక భవనం ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాలం నుండి అనేక రకాల పోరాటాలు చేశామని గుర్తు చేశారు..అయినప్పటికీ గత ప్రభుత్వాలు సామాజిక భవనంపై చిన్న చూపు చూశారని తెలిపారు..ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ విజయ సునీత త్వరలోనే సామాజిక భవనం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు