అంబేద్కర్ విజ్ఞాన మందిరానికి మోక్షం ఎప్పుడు?
అంబేద్కర్ సంఘం నాయకులు బోయినీ వల్లభాయ్ పటేల్ మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని శివాలయం సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించాల్సిన అంబేద్కర్ విజ్ఞాన మందిరం పనులు వివాదాల మధ్య నిలిచిపోయాయి. స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల అభ్యంతరాల కారణంగా నిర్మాణం ముందుకు సాగకపోవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. నిర్మాణం చేపట్టే దశలోనే అడ్డంకులు తలెత్తడంతో విజ్ఞాన మందిరం అసంపూర్తిగా మిగిలిపోయింది.ఈ పరిస్థితిపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బోయినీ వల్లభాయ్...