అంబేద్కర్ జయంతి వేళ రామకుప్పం గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ,,

చిత్తూరు జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్14) చిత్తూరు/రామ్ కుప్పం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ చొరవను అభినందించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని రామకుప్పం మండలంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధికి నూతన అధ్యాయం మొదలైంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ఈ పాఠశాలను దత్తత తీసుకుని, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మెగా సంస్థను చిత్తూరు పార్లమెంటు...