అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: దండే విఠల్
కొమురంభీమ్ జిల్లా సిర్పూర్ టీ మండలం పారిగాన్ గ్రామంలో అంబేద్కర్ భవనం నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధి, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ భవనం నిర్మాణం సమాజ...