అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బక్కని నర్సింగ్‌రావు

ఘట్‌కేసర్, మే 17 : ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 266వ వారపు నిత్య పూలమాల కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ మేడ్చల్ మల్కాజిగిరి కార్యదర్శి బక్కని నర్సింగ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ దేశంలోని పేద, పీడిత, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడని కొనియాడారు. అంటరానితనం తీవ్రంగా ఉన్న...